ఎన్నో అంచనాలతో ఈ రోజు పాన్ ఇండియా మూవీ 'లైగర్' థియేటర్ లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాసేపటి క్రితమే మొదటి షో పూర్తి అయింది. ఇప్పటికే డిఫరెంట్ ఛానెల్స్ సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలియచేశారు. నిన్నటి వరకు విజయ్ మరియు పూరి జగన్నాధ్ అభిమానులు ఏదైతే ఈ సినిమా నుండి ఆశించారో అది దొరకలేదు అనే చెప్పాలి. ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలు తీసుకోవడం ఆశ్చర్యం అని తెలుస్తోంది.
లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే హీరో హీరోయిన్ లుగా చేశారు. మిగిలిన పాత్రలలో రమ్యకృష్ణ, మైక్ టైసన్ లాంటి వారు నటించారు.

ఇక సినిమా విషయానికి వస్తే... ఇందులో చెప్పుకోవటానికి ప్లస్ లు ఎక్కువగా లేవు... ఏమైనా ఉంది అంటే మొదటి అర్ధభాగం లో హీరో విజయ్ దేవరకొండ మాత్రమే హైలైట్. అంతకు మించి ఆకట్టుకునే అంశాలు ఏమీ లేవు. అయితే విజయ్ ఇందులో ముందు సినిమాలకు మించి డిఫరెంట్ గా చేయడానికి ట్రై చేశాడు. ప్రత్యేకంగా నత్తి అనే అవలక్షణం తో ఎంటర్టైన్ చేయడానికి కష్టపడ్డాడు.


పూరి జగన్నాధ్ మూవీ యూనిట్ మొత్తం ఊదరగొట్టిన అంశం మైక్ టైసన్ ఇందులో నటించడం. కానీ అతను కూడా పెద్దగా చేసింది ఏమీ లేదు. తన లైఫ్ లో ఈ సంఘటనను ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. బహుశా ఇక టాలీవుడ్ సినిమాలలో నటించడానికి ముందుకు రాకపోవచ్చు. సెకండ్ హాఫ్ లో విజయ్ పాత్రను సరిగా రాసుకోలేదు పూరి. ఎప్పుడైనా ప్రేక్షకుడు ఫస్ట్ హాఫ్ లో కన్నా సెకండ్ హాఫ్ లో హీరో పాత్రను బాగా ఎంజాయ్ చేస్తాడు. కానీ ఇందులో ఆ అవకాశం లేకుండా చేశాడు పూరి జగన్నాధ్. సినిమాలో ఆఖరి 40 నిముషాలు అయితే భరించలేనంతగా ఉంటుంది. వచ్చే సీన్ లు అన్నీ కూడా ఊహించేలాగా ఉన్నాయి. ఇక సినిమాను ఎలా ఎంజాయ్ చేస్తాడు. అలాగే అనన్య పాండే ట్రాక్ ను కూడా చెడగొట్టాడు. ఇలా ఊహించని విధంగా లైగర్ సినిమా ఉంది. విజయ్ ఫ్యాన్స్ అయితే ఒకసారి చూడొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: