అందాల రాక్షసి మూవీ తో దర్శకుడిగా కెరీర్ ని మొదలు పెట్టి కృష్ణ గాడి వీర ప్రేమ గాధ , లై , పడి పడి లేచే మనసు మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడిగా తన కంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న హను రాఘవపూడి తాజాగా సీతా రామం అనే ప్రేమ కథా చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా , మృణాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఆగస్ట్ 5 వ తేదీన విడుదల అయ్యింది.  ఈ మూవీ ఇప్పటి వరకు 20 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.

ఈ 20 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.  నైజాం : 7.97 కోట్లు , సీడెడ్ : 1.70 కోట్లు , యూ ఏ : 2.97 కోట్లు , ఈస్ట్ : 1.68 కోట్లు , వెస్ట్ : 1.10 కోట్లు , గుంటూర్ : 1.34 కోట్లు , కృష్ణ : 1.53 కోట్లు , నెల్లూర్ : 74 లక్షలు .20 ఈ రోజుల్లో సీతా రామం మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో 19.03 కోట్ల షేర్ , 33.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 2.30 కోట్లు . ఇతర భాషలలో : 6.90 కోట్లు . ఓవర్ సీస్ లో : 6.30 కోట్లు . 20 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సీతా రామం మూవీ 34.53 కోట్ల షేర్ ,  69.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలకమైన పాత్రలో నటించగా తరుణ్ భాస్కర్ ,   భూమిక చావ్లా , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , సుమంత్  ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: