నిఖిల్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా , చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు . కార్తికేయ 2 మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై మంచి విజయం సాధించిన కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెర కెక్కింది .

మంచి విజయం సాధించిన కార్తికేయ మూవీ కి కార్తికేయ 2 మూవీ సీక్వల్ గా తెరకెక్కడం తో  కార్తికేయ 2 మూవీ పై మొదటి నుండి సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న నేపథ్యం లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది . ప్రపంచ వ్యాప్తంగా కార్తికేయ 2 మూవీ కి 12.80 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది . ఈ మూవీ 13.30 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది .

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన టాక్ లభించడంతో ఈ మూవీ విడుదల అయిన అతి తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని బాక్సా ఫీస్ దగ్గర విజయంగా నిలిచింది. ఇప్పటి వరకు 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 42.53 కోట్ల షేర్ , 83.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 29.23 కోట్ల లాభాలను అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: