తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయిన అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనుపమ పరమేశ్వరన్, నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ ఆ' మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత అనుపమ పరమేశ్వర ఎన్నో తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ హీరోగా చందు మండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదలై బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 18 పేజీస్ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. 

అలాగే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా  తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఎక్కువగా అనుపమ పరమేశ్వరన్ క్లాస్ మరియు డీసెంట్ లుక్ లో ఉన్న తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా అనుపమ పరమేశ్వరన్ డీసెంట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా అనుపమ పరమేశ్వర సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలలో వైట్ అండ్ వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. అనుపమ పరమేశ్వరన్ కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: