దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో సీతా రామం అనే సినిమా తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ లపై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించ గా , ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలక పాత్రలో నటించింది.

మూవీ లో తరుణ్ భాస్కర్ , సుమంత్ , భూమిక చావ్లా , గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా , సునీల్ , ప్రియదర్శి , మురళి శర్మమూవీ లో మరి కొన్ని పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ఆగస్ట్ 5 వ తేదీన విడుదల అయిన సీతా రామం మూవీ ఇప్పటికే భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన బ్లాక్ బస్టర్ టాక్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడంతో ఈ మూవీ విడుదల అయిన అతి తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది.

అలాగే ఇప్పటికీ కూడా ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు బాక్సా ఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సీతా రామం చిత్ర బృందం ఈ సినిమా హిందీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ సీతా రామం మూవీ ని హిందీ లో సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: