అందాల ముద్దుగుమ్మ రాశి కన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అనేక తెలుగు సినిమా లలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది.

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ని కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ , హిందీ  సినిమా లపై కూడా దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళ్ , హిందీ మూవీ లలో కూడా నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తెలుగు లో సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిరోజు పండగే మూవీ తో ఆఖరి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత రాశి కన్నా , విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ లో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్య హీరోగా తర్కెక్కిన థాంక్యూ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా ఈ ముద్దు గుమ్మ కు బాక్సా ఫీస్ దగ్గర విజయాన్ని అందించ లేక పోయింది. అలాగే తాజాగా ఈ ముద్దుగుమ్మ గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించ లేక పోయింది. ఇలా రాశి కన్నా టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస అపజయాలను అందుకుంటుంది. రాశి కన్నా ఈ మధ్య తమిళ్ లో నటించిన తిరు సినిమా మంచి విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: