విక్టరీ వెంకటేష్ ఇప్పుడు సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. పెద్ద హీరోలు ఎవరూ కూడా ఇప్పటిదాకా ఓటిటిలలో నటించిన దాఖలాలు లేవు. ఇప్పటిదాకా ఏ పెద్ద హీరో కూడా ఈ విధమైన సినిమాలలో వెబ్ సిరీస్ లో నటించలేదు. తొలిసారిగా వెంకీ ఆ విధమైన సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలను పక్కనపెట్టి మరి ఈ విధమైన వెబ్ సిరీస్ లలో నటించడం నిజంగా ఆయన ఎంతటి స్థాయిలో దీనిపై ఫోకస్ పెడుతున్నారో చెప్పవచ్చు.

ప్రముఖ ఓటీపీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో ఆయన ఓ వెబ్ సిరీసి చేస్తున్న విషయం తెలిసిందే. క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సిరీస్ లో మరొక హీరోగా రానా నటిస్తున్నారు. రానా నాయుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఆ విధంగా వెంకటేష్ ఈ సిరీస్ కోసం ఎన్నో రోజులు కేటాయించగా సినిమా అభిమానులు మాత్రం ఆయన ఎందుకు సినిమా లు ఒప్పుకోవటం లేదని నిరాశను వ్యక్తం పరుస్తున్నారు. చాలా రోజులుగా ఆయన ఒక్క సినిమాని కూడా చేయకపోవడం ఈ విధమైన నిరాశ ఏర్పడడానికి ప్రముఖ కారణం. 

తాజాగా వెంకటేష్ ఒక సినిమాను చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దర్శకుడు శివ నిర్వాన ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథను ఈ హీరోకి వినిపించగా దానికి వెంకటేష్ ఓకే చెప్పాడన్న వార్తలు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న శివ నిర్వాన త్వరలోనే ఈ సినిమా పనులను పూర్తి చేసుకుని సినిమా చేయాలనేది ఆయన ప్లాన్ గా చేసుకున్నాడు. మరి వరుస సక్సెస్ లతో జోరు మీద ఉన్న వెంకటేష్ ను ఈ దర్శకుడు సినిమా ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడు చూడాలి. విజయ్ దేవరకొండ లాంటి అగ్ర హీరోతో సినిమా చేస్తున్న శివ నిర్వాన ఆ తర్వాత వెంకటేష్ తో సినిమా చేయడం నిజంగా ప్రత్యేకమైన విషయం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: