సినిమా ప్రపంచం గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తేనే సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.


ఒక సినిమా చేయాలి అంటే దానికి ఒక కథ కావాలి. కథకు తగ్గట్టు పాత్రలు కావాలి. పాత్రకు తగ్గట్టు నటీనటులు కూడా కావాలి. అలా ఒక్క సినిమా చేయాలి అంటే ప్రతి ఒక్క చిన్న దానిని పెద్దగా చూడాలి.


నిజానికి సినిమా తీయడం అంత సులువు కాదు. దర్శకుడు కథను తెరపై చూపించాలి అంటే కేవలం తనకు నచ్చినట్లు కాకుండానే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని వారికి నచ్చినట్లుగా సినిమాను రూపొందించాలి. అప్పుడే కథకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. నిజానికి కొందరు డైరెక్టర్లు ప్రేక్షకులను అస్సలు దృష్టిలో పెట్టుకోకుండా సినిమాను చూపించాలి అని అనుకుంటారు.


అలా చూపించడం వల్లే కొందరు డైరెక్టర్లు తమ సినిమా విషయంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ సినిమా విషయంలో ప్రతిదీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని మరి సినిమాను తీస్తారు. కథ విషయంలో కొన్ని కొన్ని లాజిక్కులను కూడా జోడించి ప్రేక్షకులను ఆలోచనలో పడేలా చేస్తుంటారు.


కొన్ని కొన్ని సార్లు చిన్న లాజిక్ తోనే సినిమాను సాగదీస్తారు. అంటే ఆ లాజిక్ చుట్టే సినిమా మొత్తం తిరుగుతుంది. నిజానికి ఆ లాజిక్ ముందే చూపిస్తే సినిమాలో కొత్తదనం అనేది, ట్విస్ట్ అనేది అస్సలు ఉండదు. సినిమా అంటేనే ట్విస్టులతో కూడినది. అలాంటిది ట్విస్టులు ముందే పెట్టేస్తే ప్రేక్షకులకు సినిమా చూడటం ఆసక్తిగా అనిపించదు.


ఇక ఈ మధ్య సినిమాలలో ఒక ట్రెండ్ నడుస్తుంది. అదే ఏంటంటే.. హీరోలకు నత్తి ఉండటం. ఈ మధ్య నత్తి పాత్రలతో చాలా సినిమాలు వచ్చాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే..


ఎఫ్ 3: టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఎఫ్3. ఇందులో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇందులో వరుణ్ కు నత్తిగా చూపించాడు డైరెక్టర్.

ఉప్పెన: బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన సినిమా ఉప్పెన. ఇందులో మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించగా ఇందులో వైష్ణవ్ ను నత్తి గా చూపించాడు.


లైగర్: ఇటీవలే పూరి దర్శకత్వంలో విడుదలై ప్రేక్షకులను నిరాశ పరిచిన సినిమా లైగర్. ఇందులో విజయ్ దేవరకొండ, అనన్య జంటగా నటించగా ఈ సినిమాలో విజయ్ ను నత్తి పాత్రలో చూపించాడు పూరి.

మరింత సమాచారం తెలుసుకోండి: