బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ పేరు పొందిన ఐశ్వర్యరాయ్ కి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.. ఇప్పుడు కాస్త సినిమాలలో తగ్గించిన.. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరు కూడా ఐశ్వర్యరాయ్ వంటి అమ్మాయి అమ్మాయిగా పుట్టాలని కోరుకునేవారు. అలాంటి అందమైన ఐశ్వర్య ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈమె తాజాగా పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమానీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్నారు ఇందులో ఐశ్వర్యారాయ్ ఒక మహారాణి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ సినిమాలో పలు ఆసక్తికరమైన విషయాలను బయటకు రావడం జరిగింది వాటి గురించి చూద్దాం.


ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇందులో ఐశ్వర్యరాయ్ పాత్ర నెగటివ్ షేడ్స్ తో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు  ఐశ్వర్యరాయ్ కేవలం హీరోయిన్గా మాత్రమే ప్రేక్షకులు చూశారు..కానీ మొదటిసారిగా ఒక విలన్ పాత్రలో కూడా చూడబోతున్నట్లు సమాచారం. మరి ప్రేక్షకులు ఈ సినిమా స్పందన ఎలా ఉంటుంది అనే విషయంపై చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.


కొన్ని సందర్భాలలో ఇలాంటి ప్రయోగాలు చాలా బెడిసి కొట్టే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు.. ఎన్నో సినిమాలలో అందంగా కనిపించిన ఐశ్వర్యరాయ్ ఒక్కసారిగా విలన్ పాత్రలో చూసి ఎలాంటి స్పందన వస్తుందో చెప్పలేమని మరి కొంతమంది అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. మొత్తానికి ఐశ్వర్య రాయ్ కనుక విలన్ గా కనిపిస్తే.. ఇక ఈ సినిమాకి ఈమె హైలైట్ గా నిలవడం ఖాయమని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ పాత్రను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనే విషయాన్ని పక్కన పెడితే ఐశ్వర్యారాయ్ ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుందని చిత్రబంధం తెలియజేయడం జరిగింది. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: