యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మరి కొద్ది రోజుల్లో బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కబోతుంది.  హీరో గా రామ్ పోతినేని కి , దర్శకుడుగా బోయపాటి శ్రీను కు ఇదే మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.

మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ కోసం రామ్ పోతినేని తన లుక్ ను మార్చబోతున్నట్లు తెలుస్తోంది. అందు కోసం ఏకంగా 11 కిలాల బరువు పెరగనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. బోయపాటి శ్రీను మూవీ కోసం 11 కిలాల బరువు ను పెంచి ఒక అద్భుతమైన లుక్ లోకి రావాలి అని రామ్ పోతినేని ఆలోచిస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే  రామ్ పోతినేని తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ తెలుగు , తమిళ భాషల్లో విడుదల అయ్యింది.  మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఈ మూవీ లో రామ్ పోతినేని సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ లో రామ్ పోతినేని కెరీర్ లో మొట్ట మొదటి సారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: