కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన తలపతి విజయ్ ఈ సంవత్సరం బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. పాన్ ఇండియా మూవీ గా తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ ,  హిందీ భాషల్లో విడుదల అయిన బీస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విజయ్ తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ తమిళ్ లో వరిసు పేరుతో తెరకెక్కుతూ ఉండగా , తెలుగు లో ఈ మూవీ వారసుడు పేరుతో పెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటికే కొన్ని విజయ్ కి సంబంధించిన పోస్టర్ లను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. రష్మిక మందన ఈ మూవీ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  తమ ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  తలపతి విజయ్మూవీ తర్వాత విక్రమ్ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తనకిక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు.

మూవీ తళపతి విజయ్ కెరియర్ లో 67 వ సినిమాగా తెరకెక్కబోతుంది. ఈ మూవీ లో ఒక పవర్ఫుల్ పాత్రలో మోహన్ లాల్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మోహన్ లాల్ పాత్ర ఈ మూవీ కి హైలైట్ గా నిలవనున్నట్లు సమాచారం. ఈ మూవీ కోసం మోహన్ లాల్ ఏకంగా 60 రోజుల ను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో తలపతి విజయ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: