పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే మూవీ ని ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పంజా వైష్ణవ్  తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కొండపోలం అనే మూవీ ని ప్రారంభించాడు. దానితో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా భీమ్లా నాయక్ మూవీ పై పూర్తి ఫోకస్ పెట్టాడు.

దానితో క్రిష్ జాగర్లమూడి కొండ పొలం మూవీ ని పూర్తి చేయగా , పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ ని పూర్తి చేశాడు. ఇది ఇలా ఉంటే కొండపొలం , భీమ్లా నాయక్ మూవీ లు విడుదల అయిన తర్వాత హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ని తిరిగి ప్రారంభం అయ్యింది.  కొంత భాగం షూటింగ్ ను కూడా పూర్తి అయ్యింది. మళ్లీ మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లు మూవీ నుండి మరి కొన్ని రోజుల్లో ఒక అదిరిపోయే అప్డేట్ రానున్నట్లు తెలుస్తుంది.

సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా హరిహర వీరమల్లు మూవీ నుండి ఒక యాక్షన్ టీజర్ ని విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొట్ట మొదటి సారి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో హరిహర వీరమల్లు మూవీ పై పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ లో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: