జాతి రత్నాలు మూవీతో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అనుదీప్ కే వి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాతి రత్నాలు మూవీ తో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం తమిళ్ క్రేజీ హీరో శివ కార్తికేయన్ హీరోగా తేరకెక్కుతున్న మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అనుదీప్ కే వి 'ఫస్ట్ డే ఫస్ట్ షో' అనే మూవీ కి కథను మరియు స్క్రీన్ ప్లే ను మరియు డైలాగ్ లను అందించాడు.

మూవీ లో శ్రీకాంత్ రెడ్డి ,  సంచిత బాషు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ కి వంశీధర్ గౌడ్ , లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ ని సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి కథ ,  స్క్రీన్ ప్లే మరియు డైలాగ్ లను అందించిన అనుదీప్ కే వి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా అనుదీప్ కే వి 'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేసాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా అనుదీప్ కే వి మాట్లాడుతూ ... ఒక చిన్న టౌన్ , థియేటర్ సినిమా టికెట్ల కోసం చేసే ప్రయత్నాలు ఇలాంటి నేపథ్యంలో ఎప్పటి నుండో మూవీ ని చేయాలని ఉండేది. ప్రేక్షకులు కూడా కొత్త జోనర్ లో చూసినట్లు ఉంటుంది అని ఈ మూవీ ని స్టార్ట్ చేశాం. విడుదలకు ముందు మరియు విడుదల తర్వాత మంచి క్రేజ్ ఉన్న మూవీ ల లిస్టు ఎక్స్ప్లోర్ చేసి ఖుషి మూవీ నేపథ్యాన్ని తీసుకొని ఈ మూవీ కథను చెబుతున్నాం. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సినిమాలను చూపించాలని భావిస్తున్నాం అని అనుదీప్ కే వి తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: