టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్ గత కొన్నేళ్లలో తీసిన సినిమాలను పరిశీలిస్తే ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.


కొన్ని సినిమాలు ఈ సినిమాను నిజంగానే పూరీ జగన్నాథ్ తెరకెక్కించారా అనే ప్రశ్న మనలో మెదలడానికి కారణమయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ సాధించినా ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ పూరీ జగన్నాథ్ కు పూర్తి స్థాయిలో దక్కదనే విషయం తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ కథ, కథనంలో కూడా ఊహించని స్థాయిలో లోపాలు ఉన్నా వేర్వేరు కారణాలు ఆ సినిమా సక్సెస్ కు కారణమయ్యాయి.


కెరీర్ తొలినాళ్లలో పూరీ జగన్నాథ్ సినిమాలు అంటే కథ, కథనం అద్భుతంగా ఉండేవని ఇప్పుడు పూరీ జగన్నాథ్ సినిమాల కథ, కథనం ప్రేక్షకులకు చిరాకు తెప్పించే విధంగా ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. మాకు పాత పూరీ జగన్నాథ్ కావాలని నెటీజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ ఏ కారణం వల్ల ఇలాంటి చెత్త స్క్రిప్ట్ లతో సినిమాలను తెరకెక్కిస్తున్నారో అర్థం కావడం లేదని నెటిజన్లు చెబుతున్నారు.


 


పూరీ జగన్నాథ్ ను ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం ఈ విషయంలో పూరీ జగన్నాథ్ తీరును తప్పుబడుతున్నారట.. పూరీ జగన్నాథ్ తో సినిమాలను నిర్మించాలంటే బయటి నిర్మాతలు సైతం భయపడే పరిస్థితి నెలకొంది. పూరీ జగన్నాథ్ శ్రద్ధ పెట్టి కథలు రాయాలని లేదా మంచి రచయితలు రాసిన కథలను ఓకే చేయాలని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.


 ఆ మంచి కథలతో సినిమాలను తెరకెక్కించి పూరీ జగన్నాథ్ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలలో ఆయన మార్కు మిస్ అవుతోందని పూరీ జగన్నాథ్ అభిమానులు కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరీ ఇంతకు ముందు లాగా పూరి సినిమాలు చేస్తారో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: