మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం లో తిరగకెక్కు తున్న ధమాకా అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజకు జోడి గా పెళ్లి సందD బ్యూటీ శ్రీ లీల నటిస్తోంది . ఈ మూవీ ని దర్శకుడు త్రినాద్ రావు నక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసింది . ఈ లిరికల్ వీడియో సాంగ్ అదిరి పోయే రేంజ్ లో ఉండడం తో ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది .    

ఇది ఇలా ఉంటే తాజాగా ధమాకా మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక అదిరి పోయే అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ నుండి గ్లిమ్స్ ని రేపు అనగా ఆగస్టు 31 వ తేదీన సాయంత్రం 5 గంటల 1 నిమిషానికి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో రవితేజ మరియు శ్రీ లీల ఉన్నారు.  రవితేజ ప్రస్తుతం ధమాకా మూవీ తో పాటు ప్రస్తుతం  రావణాసుర , టైగర్ నాగేశ్వరరావు మూవీ లలో కూడా హీరోగా నటిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరో గా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో కూడా రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ వరుస మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: