టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన బెల్లంకొండ  సాయి  శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయిన v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. మొదటి మూవీ తోనే  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు . 

ఆ తర్వాత అనేక తెలుగు మూవీ లలో హీరోగా నటించిన సాయి శ్రీనివాస్ 'రాక్షసుడు' మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో తెలుగు సూపర్ హిట్ మూవీ చత్రపతి మూవీ హిందీ రీమేక్ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి వి వి వినాయక దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లను మాత్రం పెద్దగా ఈ మూవీ యూనిట్ విడుదల చేయలేదు. ఇది ఇలా ఉంటే హిందీ చత్రపతి మూవీ విడుదల కాక ముందే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు లో మరో సినిమా చేయాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 

అందులో భాగంగా సాయి శ్రీనివాస్ , నిఖిల్ హీరోగా పెరకెక్కిన అర్జున్ సురవరం మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న టీ ఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే టి ఎన్ సంతోష్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఒక కథను వినిపించగా ఆ కథ బాగా నచ్చడంతో టి ఎన్ సంతోష్ మూవీలో నటించేందుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: