మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమన్నా ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాలు పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థానంలో కొనసాగింది. అలాగే ఎన్నో సినిమాలలో ఐటమ్ సాంగ్ లలో కూడా నటించి తమన్నా తన హాట్ హాట్ అందచందాలతో డాన్స్ తో ప్రేక్షకులను అలరించింది. తమన్నా కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ , హిందీ భాషల మూవీ లలో కూడా నటించి అక్కడి ప్రేక్షకులను కూడా అలరించింది.

తమన్నా అలాగే బాహుబలి , సైరా నరసింహారెడ్డి లాంటి పాన్ ఇండియా మూవీ లలో హీరోయిన్ గా నటించడం మాత్రమే కాకుండా , కే జి ఎఫ్ లాంటి పాన్ ఇండియా మూవీ లో స్పెషల్ సాంగ్ లో కూడా నటించి దేశ వ్యాప్తంగా అదిరి పోయే క్రేజీ ను సంపాదించుకుంది. ఇలా అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన తమన్నా ప్రస్తుతం మాత్రం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడంలో కాస్త వెనుకబడిపోయింది. ప్రస్తుతం తమన్నా 'గుర్తుందా సీతాకాలం' అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మూవీ లో సత్యదేవ్ హీరోగా అనిపించాడు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో మామూలు అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ తో పాటు తమన్నా , మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా అయినా మంచి విజయం సాధించిన తమన్నా మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: