ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఓ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మన స్టార్ హీరోల సినిమాలు పాతవి మళ్ళీ వాటిని ఇప్పుడు ఉన్న 4k టెక్నాలజీ మిక్స్ చేసి రీ రిలీజ్ చేస్తున్నారు.అయితే ఇది ఈ ఏడాది టాలీవుడ్ టాప్ హీరో అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కానుకగా తన ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ “పోకిరి” రిలీజ్ చెయ్యగా..దీనికి ప్రపంచవ్యాప్తంగా చాలా భారీ రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్స్ కూడా కొత్త హిట్ సినిమాకి వచ్చిన రేంజ్ లో వచ్చాయి. ఇక నెక్స్ట్ సెప్టెంబర్ లో మరో స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటించిన హిట్ సినిమా “జల్సా” చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా పోకిరి లాగానే భారీ స్థాయిలోనే  ఈ సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేస్తున్నారు.ఇక నెక్స్ట్ నెల అక్టోబర్ నెలలో పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే వస్తుండగా ఇప్పుడు డార్లింగ్స్ ప్రభాస్ కెరీర్ లో ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అయినటువంటి “బిల్లా” చిత్రాన్ని 4కే లో రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పుడు సినీ వర్గాల్లో క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది.


అనుష్క ఇంకా అలాగే నమితలు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని స్టైలిష్ సినిమాలు తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన మెహర్ రమేష్ చాలా సూపర్ గా ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా తెరకెక్కించాడు. దీనితో ఈ సినిమాకి ఇప్పటికీ కూడా చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక ఈ సినిమాని అయితే ఇప్పుడు రీ రిలీజ్ చెయ్యడానికి ప్లాన్స్ కూడా మొదలయ్యాయి. మరి ఈ సినిమాకి రెబల్ స్టార్ ఫ్యాన్స్ నుంచి హంగామా ఎలా ఉంటుందో చూడాలి.ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో "సలార్", ఓం రౌత్ డైరెక్షన్లో "ఆది పురుష్", నాగ్ అశ్విన్ డైరెక్షన్లో "ప్రాజెక్ట్ కే" లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.మరి ఈ సినిమాలు ఎంత పెద్ద హిట్ అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: