ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకలు చాలా స్పెషల్ గా మారిపోతున్నాయి అభిమానులకు. ముఖ్యంగా స్టార్ హీరోలు నటించిన పాత సినిమాలను చాలా గ్రాండ్గా రిలీజ్ చేసి తమ హీరోల పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. అలా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి మరియు ఒక్కడు సినిమాలను తెలుగు రాష్ట్రాలలో పాటు విదేశాలలో కూడా ఈ సినిమాను విడుదల చేసి మహేష్ బాబు పుట్టినరోజు చాలా గ్రాండ్గా సందడి చేసుకున్నారు అభిమానులు. అయితే ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు ఏం చేశారో వాటిని ఫాలో అవుతున్నారు ఇతర హీరోల అభిమానులు.


ఇక చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఘరానా మొగుడు సినిమాను కూడా విడుదల చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమా మరియు తమ్ముడు సినిమాలను విడుదల చేసేందుకు వాళ్ళు ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. ఇక అతి త్వరలోనే రాబోతున్న ప్రభాస్ పుట్టిన రోజుకు కూడా ఆయన అభిమానులు సైతం భారీ ఎత్తుగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అందులో భాగంగా ప్రభాస్ నటించిన బిల్లా సినిమా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

ప్రభాస్ ఎన్ని సినిమాలలో నటించినా కూడా ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం బిల్లా అని చెప్పవచ్చు. అందుచేతన ఆ సినిమాను ఇప్పుడు ప్రభాస్ అభిమానులు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని చాలా ఆశపడుతున్నారు. అందుచేతనే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేసే విధంగా నిర్మాతలను ఒప్పించడం జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రభాస్ అభిమానుల సంఘం నాయకులు కూడా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా థియేటర్లలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. మొత్తానికి ప్రభాస్ అభిమానులు తమ పుట్టినరోజు వేడుకలను ఇలా సందడి చేయడం ఓ రేంజ్ లో ఉంటుంది అని ఆయన అభిమానుల సైతం భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: