టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన నిఖిల్ తాజాగా కార్తికేయ 2 అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నడిపించగా , చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో శ్రీనివాస్ రెడ్డి , వైవా హర్ష ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై మంచి విజయం సాధించిన కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తేరగకెక్కింది.

చాలా సంవత్సరాల క్రితం మంచి విజయం సాధించిన కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకేక్కడంతో కార్తికేయ 2 మూవీ పై సినీ ప్రేమికులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ కార్తికేయ 2 మూవీ ఆగస్టు 13 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభించడంతో ఈ మూవీ అద్భుతమైన కలక్షన్ లను ఇప్పటికీ కూడా రాబడుతుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు కార్తికేయ 2 మూవీ 18 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.  18 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 50.66 కోట్ల షేర్ , 101.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో 18 రోజులు ముగిసే సరికి కార్తికేయ 2 మూవీ 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది. ఈ సినిమా రాబోయే రోజుల్లో ఇంకా ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: