దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా అను రాఘవపూడి దర్శకత్వంలో సీతా రామం అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలకమైన పాత్రలో నటించగా , సుమంత్ , భూమిక చావ్లా , తరుణ్ భాస్కర్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్మూవీ లో ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ లపై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.

మూవీ ఆగస్టు 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ లభించడంతో ఈ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక లాభాలను అందుకుంటుంది. అలాగే ప్రస్తుతం కూడా ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.  ఇప్పటి వరకు 26 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
 
నైజాం : 9.27 కోట్లు .
సీడెడ్ : 1.85 కోట్లు .
యూ ఏ : 3.38 కోట్లు .
ఈస్ట్ : 1.88 కోట్లు .
వెస్ట్ : 1.21 కోట్లు .
గుంటూర్ : 1.51 కోట్లు .
కృష్ణ : 1.67 కోట్లు .
నెల్లూర్ : 84 లక్షలు .
26 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో సీతా రామం మూవీ 21.61 కోట్ల షేర్ , 38.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  2.70 కోట్లు .
ఇతర భాషలలో : 7.80 కోట్లు .
ఓవర్ సీస్ లో : 6.90 కోట్లు .
26 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా సీతా రామం మూవీ 39.01 కోట్ల షేర్ , 78.65 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: