తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఉప్పెన మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరో ఆ తర్వాత కొండపొలం అనే వైవిధ్యమైన మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో రంగ రంగా వైభవంగా అనే మూవీ లో హీరోగా నటించాడు.  

మూవీ కి గిరిశయ్య దర్శకత్వం వహించగా , రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మమూవీ లో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.  సెప్టెంబర్ 2 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం  ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. దానితో ఈ మూవీ ట్రైలర్ ఇప్పటి వరకు 7.7 మిలియన్ వ్యూస్ ని , 1.3 లైక్ లను యూట్యూబ్ లో సాధించింది.

ఓవరాల్ గా చూసుకుంటే రంగ రంగా వైభవంగా మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు రంగ రంగ వైభవంగా మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు పెట్టుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కిన రంగా రంగా వైభవంగా సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: