తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే అదిరి పోయే రేంజ్ విజయాన్ని , అంతకు మించిన క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మ లలో ఒకరు అయిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పెన మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దు గుమ్మ మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ విజయాన్ని అంతకుమించిన క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇలా మొదటి మూవీ తోనే అద్భుత విజయాన్ని సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ కు ఆ తర్వాత వరుస క్రేజీ సినిమాల అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఉప్పెన మూవీ తర్వాత బంగార్రాజు ,  శ్యామ్ సింగరాయ్ మూవీ లతో బాక్సా ఫీస్ దగ్గర విజయాలను అందుకుంది. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం విడుదల అయిన ది వారియర్ మరియు మాచర్ల నియోజక వర్గం మూవీ లతో వరుస అపజయాలను బాక్సా ఫీస్ దగ్గర ఎదుర్కొంది.

ఇలా వరుస అపజయాలను బాక్సా ఫీస్ దగ్గర ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా సుదీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల కాబోతోంది. ఇప్పటికే వరుసగా రెండు అపజయాలను బాక్సా ఫీస్ దగ్గర ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ ఈ మూవీ తో అయినా హిట్ కొడుతుందో లేదో చూడాలి. ఈ మూవీ కనుక బాక్సా ఫీస్ దగ్గర హిట్ గా నిలవనట్లు అయితే కృతి శెట్టి కి కెరీర్ కు కష్టాలు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: