కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఆ తరువాత మాస్ మహారాజా రవితేజ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆంజనేయులు మూవీ తో నిర్మాతగా మారాడు. ఇలా ఆంజనేయులు మూవీ తో నిర్మాతగా మారిన బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని బ్లాక్ బాస్టర్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోలతో మూవీ లను నిర్మించిన బండ్ల గణేష్ ప్రస్తుతం మాత్రం సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం బండ్ల గణేష్ 'డేగల బాబ్జి' అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. 

తమిళంలో జాతీయ అవార్డు అందుకున్న ‘ఉత్త సిరుప్పు సైజు 7’ మూవీ ని తెలుగు లో డేగల బాబ్జీ పేరుతో రీమేక్ చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఏ సినిమా 'ఓ టి టి' విడుదలకు సంబంధించిన అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ ని సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా 'ఓ టి టి' సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టు కుంటుందో చూడాలి. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే సెప్టెంబర్ 2 వ తేదీన ఈ మూవీ ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: