నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధానపాత్రలో తెరకేక్కిన మహానటి అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా తెరకెక్కిన సీతా రామం అనే మరో తెలుగు సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించగా , రష్మిక మందన ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ , సుమంత్ , భూమిక చావ్లా , తరుణ్ భాస్కర్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. మంచి అంచనాల నడుమ సీతా రామం మూవీ ఆగస్టు 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ ఇప్పటి వరకు 27 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ 27 రోజుల్లో సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 9.51 కోట్లు .
సీడెడ్ : 1.88 కోట్లు .
యూ ఏ : 3.45 కోట్లు .
ఈస్ట్ : 1.92 కోట్లు .
వెస్ట్ : 1.24 కోట్లు .
గుంటూర్ : 1.56 కోట్లు .
కృష్ణ : 1.71 కోట్లు .
నెల్లూర్ : 86 లక్షలు .
27 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో సీతా రామం మూవీ 22.13 కోట్ల షేర్ , 39.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 2.75 కోట్లు .
ఇతర భాషలలో : 7.90 కోట్లు .
ఓవర్ సీస్ లో 6.95 కోట్లు .
27 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా సీతా రామం మూవీ 39.73 కోట్ల షేర్ , 80.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: