టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన నిఖిల్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా , చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో శ్రీనివాస్ రెడ్డి , వైవా హర్ష ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై బాక్సా ఫీస్ దగ్గర ఘన విజయం సాధించిన కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తేరగకెక్కడంతో కార్తికేయ 2 మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ నుండి ఈ సినిమా విడుదలకు ముందు మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా అదిరి పోయే రేంజ్ లో ఉండడంతో కార్తికేయ 2 మూవీ పై ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

అలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 12.80 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 13.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా ఇప్పటి వరకు 19 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.  ఈ సినిమా 19 రోజుల బాక్స్ ఆఫీస్ రన్  పూర్తి అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 52.30 కోట్ల షేర్ , 105.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో కార్తికేయ 2 మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 39 కోట్ల లాభాలను సాధించింది. ఇప్పటికి కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: