తెలుగు చిత్ర  పరిశ్రమలు అటు మెగా ఫామిలీ తో పాటు దగ్గుపాటి ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ అంటూ కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలందరూ కూడా ఈ కుటుంబాల నుంచి వచ్చిన వారే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంటుంది అని చెప్పాలి. ఇలా ఇండస్ట్రీలో అగ్ర కుటుంబంగా కొనసాగుతున్న దగ్గుపాటి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి  వెంకటేష్ తర్వాత నటుడిగా పరిచయం అయింది రానా దగ్గుబాటి.


 అక్కినేని దగ్గుబాటి కుటుంబాలు వియ్యంకులు గూడా.. రామానాయుడు కూతురును  నాగార్జున పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకొని వేరు పడ్డారు. కానీ వీరి కుటుంబాల మధ్య అనుబంధం మాత్రం అలాగే కొనసాగుతుంది.  వెంకటేష్ తన మేనల్లుడు నాగచైతన్య కోసం ఏమైనా చేస్తూ ఉంటాడు. ఇక నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ అలాగే దగ్గుబాటి కుటుంబం నుంచి రానా కూడా హీరోలుగా రాణిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేదే నమ్ముతుంటారు. ఎన్టీఆర్ రానా బావ బావ అని పిలుచుకోవడం అందరిని ఆకట్టుకుంటుంది.


 మీలో ఎవరు కోటీశ్వరుడు షో కోసం రామ్చరణ్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఫ్రెండ్స్ హెల్త్ తీసుకోవచ్చు అని అంటాడు.  అప్పుడు రామ్ చరణ్ రానా కి కాల్ చేస్తాడు. అయితే రానా ఎన్టీఆర్ బావ బావ అనుకుంటూ ఉంటారు. అయితే ఇద్దరూ అలా పిలుచుకోవడానికి వెనుక ఒక ఆసక్తికర విషయం కూడా ఉందట. మాములుగా  ఎన్టీఆర్ కి బంధుత్వం కలుపుకోవడం అంటే ఎంతో ఇష్టం. అందుకే అల్లు అర్జున్ ని బావ అని పిలుస్తాడు.  నాగార్జున ని బాబాయి అని పిలుస్తాడు. సురేష్ బాబు ని ఎన్టీఆర్ మామ అనిపిస్తాడు.  తద్వారా ఎన్టీఆర్ రానా  బావా అంటే  బావా అని అనుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ అందర్నీ కుటుంబ సభ్యుల్లా  భావిస్తూ  వరుసలతో  పిలుస్తూ ఇంట్లో మనిషిగానే వ్యవహరిస్తూ ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: