మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ ఈ సంవత్సరం మార్చ్ 25 వ తేదీన విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ కి రాజమౌళి దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ కూడా ఈ మూవీ లో హీరోగా నటించాడు. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను దేశ వ్యాప్తంగా సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ కావడంతో , ఈ మూవీ ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణను జరుపుకుంటుంది.

సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తి.అయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే రామ్ చరణ్ 'జెర్సీ' మూవీ తో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న గౌతమ్ తిననూరి దర్శకత్వంలో ఒక మూవీ లో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగ వంతంగా జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే గౌతమ్ తిన్ననూరి మూవీ తర్వాత రామ్ చరణ్ , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనకరాజు తాజాగా విక్రమ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ దర్శకుడు మరి కొన్ని రోజుల్లో తలపతి విజయ్ తో ఒక మూవీ చేయనున్నాడు. ఆ మూవీ తర్వాత రామ్ చరణ్ తో ఒక మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాలకు అదిరిపోయే లైనప్ ని సెట్ చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: