మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక  ఈయన చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇకపోతే చిరంజీవికి తగ్గ తమ్ముడిగా ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇక  పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అనే పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన స్టోరీ దాగుంది. పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.అయితే  పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ లోకి రాకముందు ఆయన పేరు కళ్యాణ్ కుమార్.

కాగా పవన్ కళ్యాణ్ ముందుగా అంజనా ప్రొడక్షన్ బ్యానర్లో చాలా సినిమాలకు అన్న నాగబాబు తో కలిసి సహ నిర్మాతగా వ్యవహరించారు. అయితే పవన్ కళ్యాణ్ మొదటి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఇక ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కింది. ఈ సినిమా అనుకున్నంత ఫలితాన్ని అందించలేకపోయింది.అయితే ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో గోకులంలో సీత అనే సినిమాలో హీరోగా చేశారు.ఇక  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకి పోసాని కృష్ణ మురళి మాటలు సమకూర్చారు. అయితే ఇక  ఈ సినిమా రిలీజ్ సందర్భంగా పోసాని కృష్ణ మురళి మొదటిసారి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మొదటిసారిగా పవన్ కళ్యాణ్ ని 'పవర్ స్టార్' అని పిలిచారు.అప్పటి నుండి చాలా పత్రికలు పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ పేరు ను జోడించి కథనాలు రాశాయి.

'గోకులంలో సీత' సినిమా చేసే టైం లో కళ్యాణ్ కుమార్ పేరు కాస్త పవన్ కళ్యాణ్ గా మారింది. ఇక ఆ తర్వాత 'సుస్వాగతం' అనే సినిమాలో పవన్ కళ్యాణ్ నటించాడు. తొలిసారి ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరుకు ముందు 'పవర్ స్టార్' అనే బిరుదు తో టైటిల్ కార్డు వేశారు.అయితే  ఇలా పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అనే పేరు రావడం వెనుక పోసాని కృష్ణ మురళి కారణమయ్యారు. కాగా ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తో పాటు పోసాని కృష్ణ మురళి కూడా చెప్పుకొచ్చాడు. ఇకపోతే పవర్ స్టార్ అనే పేరు పెట్టుకోవడమే కాకుండా దానికి తగ్గట్టుగా ఇండస్ట్రీలో తన సత్తా చూపిస్తూ వస్తున్నాడు పవన్ కళ్యాణ్.  ఇదిలావుంటే ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు..!!.

మరింత సమాచారం తెలుసుకోండి: