సినిమా పరిశ్రమలో రాణించాలి అంటే బోలెడంత టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని సినిమా పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని మాత్రమే నమ్ముకుని కొంతమంది హీరోయిన్ లు నెంబర్ వన్ స్థానంలో కాకపోయినా ఒక మోస్తరు హీరోయిన్ గా ఎదగాలని కోరుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరు లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అన్న గుర్తింపును సంపాదించుకుంది.

ఆ విధంగా లావణ్య త్రిపాఠి తొలి సినిమాతో ఇంతగా అలరించడంతో భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవడం ఖాయం అని ప్రతి ఒక్కరు కూడా భావించారు. కానీ ఈమె అనుకున్నంత స్థాయికి ఎదగకపోవడం ఆమె అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. సినిమా సినిమాకు తన అంద చందాలు పంచడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్న సమయంలోనే భారీ స్థాయిలో అభిమానులను కూడా పొందగలిగింది. ఈ నేపథ్యంలోనే ఈమె ప్రేక్షకులందరినీ తప్పకుండా అలరించే హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు.

కానీ ఆమెకు సరైన సినిమాలు పడకపోవడం పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు రాకపోవడానికి కారణం అయ్యింది. చిన్న హీరోలతో మాత్రమే నటిస్తూ ఆ సినిమాల ద్వారా విజయాన్ని అందుకుంది. ఇటీవలే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఆమె ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసిన కూడా అతి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. శాకినీ డాకిని అనే పేరుతో ఆమె ఓ సినిమాలో చేయగా అది విడుదల కు సిద్ధం అవుతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. ఈ విధంగా హీరోయిన్ పాత్రలలో మాత్రమే కాకుండా ఈ ముద్దుగుమ్మ లేడి ఓరియంటెడ్ సినిమాలతో కూడా తన సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. మరి ఆమెకు ఈ సినిమా మంచి ఫలితాన్ని తీసుకు వస్తుందా అనేది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: