కన్నడ సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'కే జి ఎఫ్ చాప్టర్ 2' మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. కే జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీన కన్నడ తో పాటు తెలుగు , తమిళ , హిందీ , మలయాళ భాషల్లో విడుదల అయిన కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది .

ఇలా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే బుల్లి తెరపై ప్రసారం అయ్యింది . ఈ మూవీ తెలుగు లో జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అయ్యింది. ఈ మూవీ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కూడా అదిరి పోయే రేంజ్ లో అలరించింది. ఈ మూవీ మొదటి సారి తెలుగు లో  ప్రసారం అయినప్పుడు జీ తెలుగు ఛానల్ లో 9.15 'టి ఆర్ పి' ని సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఒక డబ్బింగ్ సినిమా తెలుగు లో ఈ రేంజ్ 'టి ఆర్ పి' ని సాధించడం చాలా గొప్ప విషయం అని చెప్ప వచ్చు. కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ లో సంజయ్ దత్ ప్రతి నాయకుడు పాత్రలో నటించగా రవి బుస్రుర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: