వినాయక చవితి ఉత్సవాల ఎఫెక్ట్‌ అనేది బాలీవుడ్‌ మూవీ బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌పై పడింది. దీంతో మొత్తం ఈవెంట్‌ని రద్దు చేసింది బ్రహ్మస్త్ర మూవీ యూనిట్.నిజానికి రామోజీ ఫిలిం సిటిలో ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుక జరగాల్సి ఉంది.అయితే వినాయక చవితి పండుగ ఉత్సవాల బందోబస్తులో సిబ్బంది బిజీగా ఉన్నారని.. అందుకే ఈవెంట్‌కి సెక్యూరిటీ కల్పించలేమన్నారు పోలీసులు. దీంతో లాస్ట్ మినిట్‌లో ఈవెంట్ రద్దయింది.కాసేపట్లో మూవీ యూనిట్‌ మీడియాతో మాట్లాడనున్నారు.ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అన్ని సినిమాల కంటే భారీ బడ్జెట్ తో ది మోస్ట్ అవేటెడ్ మూవీ గా బాలీవుడ్ పాన్ ఇండియన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న బ్రహ్మస్త్రను… యంగ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జి డైరెక్ట్‌ చేస్తున్నారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు. రాజమౌళి తెలుగులో ప్రజెంట్ చేస్తున్నారు.


ఇక టూ పార్ట్స్ గా తెరకెక్కుతున్న ఈలో.. ఫస్ట్ పార్ట్ శివ.. సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఈ ప్రమోషన్స్ ను పరిగెత్తిస్తున్నారు ఈ మూవీ మేకర్స్. నాగ్ , రాజమౌళి ఇప్పటికే చెన్నైకి వెళ్లి మీర బ్రహ్మస్త్రను కోలీవుడ్ ఫిల్మీ లవర్స్ కు పరిచయం చేశారు. ఇక తాజాగా తెలుగు టూ స్టేట్స్ లో కూడా బజ్ క్రియేట్ చేసేందుకు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్స్ వేదికగా ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తున్నారని అనౌన్స్ చేసి.. తాజాగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్టయ్యే కొన్ని గంటల ముందు.. ఈవెంట్ రద్దైనట్టు అనైన్స్ చేశారు మేకర్స్. పోలీసు పర్మషిన్ లేని కారణంగా ఈవెంట్ నిర్వహించలేమంటూ.. మీడియాతో చెప్పారు. అయితే ఈవెంట్ కు బదులు ప్రెస్ మీట్ నిర్వహిస్తామని చెప్పారు. బాయ్ కాట్ బ్రహ్మస్త్ర అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ రచ్చ లేపుతున్నారు. పాపం బ్రహస్త్ర టీం ప్రమోషన్స్ తో జనాలను థియేటర్లకు రప్పించడానికి ఎన్నో పాట్లు పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: