ఈరోజు ఎక్కువగా సోషల్ మీడియాలో తమిళ సినీ నటి మహాలక్ష్మి వివాహానికి సంబంధించిన ఫోటోలు ఎక్కువగా వైరల్ గా అవుతున్నాయి ఈమె తమిళ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ను వివాహం ఈరోజు చేసుకున్నది. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉన్నవారు వివాహం చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఈ ఫోటోలు అంతకుమించి ఉన్నట్లుగా ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమ వివాహం కు కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు సైతం హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇక అంతే కాకుండా వీరిద్దరి బంధుమిత్రుల సహాయంతో కూడా ఈ వివాహం జరిగినట్లుగా సమాచారం.
ఈ వివాహం అంగ రంగ వైభవంగా జరగడంతో తమిళ మీడియాలో పలు కథనాలు బాగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే వివాహం ఎలా జరిగిందో అనే విషయాన్ని ఎక్కువగా ప్రేక్షకులు పట్టించుకోలేదు కానీ తమ పెళ్లి ఫోటోలు షేర్ చేసిన మహాలక్ష్మి ఇంస్టాగ్రామ్ లో నిన్ను వివాహం చేసుకోవడం నువ్వు నా జీవితంలోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఒక పోస్ట్ ని చేసింది. నిన్ను భర్తగా పొందడం చాలా సంతోషంగా ఉంది లవ్ యు అమ్ము అంటూ రాసుకుంది. ఇక అంతే కాకుండా నిర్మాత రవిచంద్ర కూడా ఈ పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకున్నారు.అయితే ఈ జంటకు ఇది మొదటి వివాహం కాదు రెండో వివాహం. అయితే వీరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం బాగానే గుర్తింపు సంపాదించుకున్నారు. ఇదివరకే వీరిద్దరికీ వివాహమైన కొన్ని మనస్పర్ధలు కారణాల చేత వారి జీవిత భాగస్వామిలతో విడిపోయి ఒంటరిగా గడుపుతున్నారు. ఇలాంటి సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇలా ఇద్దరు ఒంటరిగా ఉండడంతో మీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొని చెన్నైలో ఈరోజున అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: