టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేయాలన్న వారు అలరింపబడే సినిమాలు చేయాలన్న నిర్మాత దిల్ రాజు అందులో ఎంతో సిద్ధహస్తుడు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయిన చిత్రాలే కావడం విశేషం. పెద్ద పెద్ద హీరోలకు మరచిపోలేని హిట్ సినిమాలను అందించిన ఈ నిర్మాత చిన్న సినిమాలను నిర్మించడంలో సైతం తనదైన శైలిని చాటుకున్నాడు

కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ అగ్ర దర్శకులుగా వారిని మార్చడంలో దిల్ రాజు ఎంతో స్పెషాలిటీ చూపిస్తూ ఉంటాడు. ఆయన బ్యానర్ లో వచ్చే సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఓరియెంటెడ్ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు. ఆ విధంగా ఇప్పుడు ఒక హీరో కోసం మంచి కథను వెతికే పనిలో పడ్డాడు. ఈ అగ్ర నిర్మాత ఎప్పటినుంచో ఆయన విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు ఆ విధంగా ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ సముఖంగా ఉండడంతో ఒక మంచి కథను సిద్ధం చేయడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆయన వద్ద ఉన్న చాలా మంది దర్శకులతో మంతనాలు జరుపుతూ ఒక మంచి కథను తయారు చేయమని చెబుతున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన కథను తయారుచేసి విజయ్ దేవరకొండ తో దానిని మొదలుపెట్టబోతున్నాడు. వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడో రావలసి ఉంది. ప్రస్తుతం శివనిర్వాన చేస్తున్న కృషి సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే రావాల్సి ఉంది కానీ ఈ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారితో చేయడం తో మరొక సినిమా దిల్ రాజుకు చేయవలసి ఉంది. ఆ విధంగా దినరాజుతో త్వరలోనే ఓ ప్రాజెక్టును మొదలు పెట్టబోతున్నాడు. దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: