కొంతమంది దర్శకులకు ఏ విధంగా డిమాండ్ ఏర్పడుతుంది అంటే వారు కొన్ని సినిమాలు చేసినా కూడా వారితో సినిమాలు చేయాలని పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులోనూ సక్సెస్ ఉన్న దర్శకులతో అయితే ప్రతి ఒక్క హీరో కూడా సినిమా చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇటీవల విక్రమ్ సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేసుకుని ప్రేక్షకులను ఎంతగానో అలరించిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయాలని చాలామంది తెలుగు హీరోలు ఆయన కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆయనతో సినిమా చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన కోసం చాలామందిని సంప్రదిస్తున్నారట ఈ హీరో. ఇటీవలే దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులందరినీ ఎంతగానో అలరించిన ఈ హీరో శంకర్ దర్శకత్వంలో ఇప్పుడు ఓ సినిమాను చేస్తున్నాడు. ఆ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నాడు. వీరిద్దరూ మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఆయన ఓ సినిమా చేయబోతున్నాడు.

ఈ మూడు మాత్రమే కాకుండా లోకేష్ తో కూడా ఆయన సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకోవడం విశేషం. మరి విక్రమ్ సినిమా తరువాత ఆయన ఖైదీ రెండవ భాగం సినిమాను చేయబోతున్నాడు. అంతేకాదు విక్రమ్ రెండవ భాగం సినిమాను కూడా ఆయన చేయబోతున్నాడు. సూర్యతో ఆయన ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం అవుతుంది.  విజయ్ దళపతి తో కూడా ఆయన సినిమా చేయబోతున్నాడు. ఇన్ని సినిమాలు పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఆ సినిమాను పూర్తి చేసి ఎప్పుడు చరణ్ తో సినిమాను ఎప్పుడు మొదలు పెడతాడు చూడాలి.ప్రస్తుతం శంకర్ సినిమా ను పూర్తి చేసే పనిలో రామ్ చరణ్ ఉన్నాడు. ఇది సంక్రాంతి కి విడుదల కాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: