టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇప్పుడు అగ్ర హీరోయిన్ గా ఎదిగే సత్తా ఉన్న హీరోయిన్ లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు నిధి అగర్వాల్. తొలి సినిమా నుంచి ఇప్పటివరకు ప్రేక్షకులను ఎంతగానో అలరించి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఒక భారీ చిత్రంలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈమెకు తీసుకువచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మ తప్పకుండా పెద్ద హీరోయిన్ అవుతుందని ప్రతి ఒక్కరూ భావించారు.

 కానీ ఆ చిత్రం తర్వాత ఆమె సక్సెస్ అందుకున్న దాఖలాలు లేవు. ఒకటి కాదు రెండు కాదు వరుస ఫ్లాపులతో తన స్టార్టమ్ ను కోల్పోతుందని చెప్పాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా ద్వారా తప్పకుండా మంచి విజయాన్ని అందుకొని మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా మారాలని ఆమె భావిస్తుంది త్వరలోనే ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో తెలియనుంది.  

ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా ఇతర భాషలలో సైతం ఈ ముద్దుగుమ్మకు మంచి అవకాశాలు వచ్చాయి. వాటి ద్వారా భా రీ విజయాలను అందుకుని ప్రేక్షకులను అలరించాలనేది ఆమె ఆలోచన. సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ ఎంతో యాక్టివిటీ గా ఉంటూ ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న సినిమాలను ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకొని చేయకపోతే త్వరలోనే ఆమె కెరియర్ దశకు చేరుకోవడం ఖాయం. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఈమె అందాలకు ప్రేక్షక అభిమానులు చాలామంది ఉన్నారు. మరి దానికి తోడుగా ఒక మంచి విజయం వస్తే తప్పకుండా ఆమె భారీ స్థాయి హీరోయిన్ గానే మారుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: