దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో సీతా రామం అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలక పాత్రలో నటించగా ,  గౌతమ్ వాసుదేవ్ మీనన్ ,  సుమంత్ ,  భూమిక చావ్లా , తరుణ్ భాస్కర్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ లపై ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.

మూవీ ని ఆగస్టు 5 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేశారు. ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా నుండి మూవీ యూనిట్ విడుదల చేసిన పాటలు , ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మొదటి నుండి భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ఆగస్టు 5 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. దానితో ఈ మూవీ కి ఇప్పటికి కూడా మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ 28 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.

మూవీ విడుదలకు ముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 16.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగిన ఈ మూవీ 28 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 40.53 కోట్ల షేర్ , 82.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో 28 రోజులకు గాను ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 23.53 కోట్ల లాభాలను సాధించి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: