మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి రాంచరణ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఇక తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సి 15 సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉన్నది. దీంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందాడు. అందుచేతనే ఈ సినిమాను అందుకు తగ్గట్టుగానే తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్రబంధం.
ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు విచిత్రంలో కీయరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నది అయితే తాజాగా సోషల్ మీడియాలో రామ్ చరణ్ కు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇందులో రామ్ చరణ్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఫోటోలు చూస్తుంటే రామ్ చరణ్ బిజినెస్ మ్యాన్ లుక్ లో చాలా సీరియస్ గా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా హెలికాఫ్టర్ నుంచి దిగుతున్న రామ్ చరణ్ లుక్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ ఫోటోలు శంకర్ సినిమా కోసమా లేదా అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు

అయితే ఈ చిత్రం మాత్రం పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.ఇందులో రామ్ చరణ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. గతంలో ఈ సినిమా నుంచి రామ్ చరణ్ లుక్స్ కొన్ని నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: