టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించిన విజయ్ దేవరకొండ , తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి చూపులు మూవీ తో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి , గీత గోవిందం మూవీ లతో విజయ్ దేవరకొండ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ 'లైగర్' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. పూరి కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లపై ఈ మూవీ ని పూరి జగన్నాథ్ మరియు కరన్ జోహార్ లు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ లో రమ్యకృష్ణ , విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించగా ,  మైక్ టైసన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఆగస్టు 25 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర తీవ్రమైన నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

దానితో ఈ మూవీ కి కలెక్షన్ లు కూడా రోజు రోజుకు పడిపోతూ వస్తున్నాయి. చివరగా ఈ మూవీ కి తీవ్ర మొత్తంలో నష్టాలు మిగిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనితో టైగర్ మూవీ లో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. లైగర్ మూవీ కోసం తాను తీసుకున్న రెమ్యూనిరేషన్ లో నుండి 6 కోట్ల రూపాయలను ప్రొడ్యూసర్ లకు తిరిగి వెనక్కి ఇచ్చేయాలి అని విజయ్ దేవరకొండ నిర్ణయించుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: