టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజా వారు రాణి గారు మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ యువ హీరో ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందు కున్నాడు. ఆ తర్వాత సెబాస్టియన్ అనే మూవీ లో కిరణ్ అబ్బవరం హీరో గా నటించాడు. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయింది. తాజాగా కొన్ని రోజుల క్రితమే ఈ యువ హీరో సమ్మతమే అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో నేను మీకు బాగా కావలసిన వాడిని అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి శ్రీధర్ గాడే దర్శకత్వం వహించగా , మణిశర్మమూవీ కి సంగీతాన్ని అందించాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని సెప్టెంబర్ 9 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ సెప్టెంబర్ 9 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయడం లేదు అని , సెప్టెంబర్ 16 వ తేదీన ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయబోతున్నాము అని తెలియ జేస్తూ మూవీ యూనిట్ అధికారికంగా ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: