మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . హ్యాపీ డేస్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న అందరు స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొన సాగింది . ప్రస్తుతం తమన్నా ,  మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తుంది. తమన్నా మూవీ లలో కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా అనేక మూవీ లలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. 

ఇది ఇలా ఉంటే తమన్నా తాజాగా బబ్లీ బౌన్సర్ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని థియేటర్ లలో కాకుండా నేరుగా ప్రముఖ  'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ సినిమా ట్రైలర్ గురించిన అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ ను రేపు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. మరి తమన్నా 'బాబ్లీ బౌన్సర్' అనే లేడీ ఓరియంటెడ్ మూవీ తో ఎలాంటి ప్రశంసలను అందుకుంటుందో చూడాలి. ఈ మూవీ కి మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: