తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి ఇమేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయిన చియన్ విక్రమ్ తాజా గా కోబ్రా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో విక్రమ్ సరసన శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటించగా అజయ్ జ్ఞానముత్తు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు . ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు . ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఆగస్టు 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది .

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రేక్షకుల నుండి కాస్త నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది . ఈ మూవీ కి తమిళనాడు లో కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ఈ మూవీ మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ మూడు గంటల నుండి చిత్ర బృందం 20 నిమిషాల నిడివిని కూడా కత్తిరించింది. విక్రమ్ తాజాగా కోలీవుడ్ మీడియాతో  మాట్లాడుతూ ఉండగా విజయ్ ప్రస్తావన వచ్చింది.

విజయ్ స్టయిల్ మరియు ఆయన డైలాగ్ డెలివరీ అలాగే ఆయన డాన్స్ అంటే తనకి చాలా ఇష్టమని తాజాగా విక్రమ్ తెలియజేశాడు.  ఆయనతో ఒక మల్టీస్టారర్ మూవీ ని చేయాలనే ఆశతో ఉన్నానని విక్రమ్ అన్నారు. భవిష్యత్తులో తమ కాంబినేషన్ లో ఒక మూవీ ఉంటుందని విక్రమ్ చెప్పారు.  తమ కాంబినేషన్ లో మూవీ కి కూడా అజయ్ జ్ఞానముత్తునే దర్శకత్వం వహిస్తాడని తాజాగా విక్రమ్ చెప్పు కొచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తలపతి విజయ్ , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: