దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా సీతా రామం అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే  ఈ మూవీ కి అందాల రాక్షసి ,  కృష్ణగాడి వీర ప్రేమ గాధ , లై , పడి పడి లేచే మనసు మూవీ లకు దర్శకత్వం వహించిన హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న  సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ మూవీ ని నిర్మించాడు. విశాల్ చంద్రశేఖర్ ఈ మూవీ కి సంగీతం అందించగా ,  రష్మిక మందన ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించింది.
\
గౌతమ్ వాసుదేవ్ మీనన్ ,  తరుణ్ భాస్కర్ ,  సుమంత్ ,  భూమిక చావ్లా ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ మూవీ ఆగస్టు 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పటికి కూడా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. అలాగే ఈ సినిమా ప్రస్తుతం కూడా మంచి కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేస్తుంది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన సీతా రామం మూవీ మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో సీతా రామం మూవీ సెప్టెంబర్ 9 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ మూవీ 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: