రణబీర్ కపూర్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మాతగా రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిన బ్రహ్మాస్త్ర సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెల్సిందే. సాదారణంగా బాలీవుడ్ సినిమాలకు సౌత్ లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బజ్ అనేది పెద్దగా ఉండదు.అందువల్ల బ్రహ్మాస్త్ర సినిమా గురించి కూడా జనాలు పట్టించుకుంటారా అనే అనుమానం వ్యక్తం అయ్యింది.అయితే ఈ సినిమాకి టాప్ డైరెక్టర్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు తాజాగా ఎన్టీఆర్ సినిమా  ప్రెస్ మీట్ లో పాల్గొని సినిమాపై అంచనాలు పెరిగే విధంగా మాట్లాడాడు. అంతే కాకుండా రాజమౌళి కూడా ఆహా ఓహో అంటూ సినిమా పై పొగడ్తల వర్షం కురిపించాడు. దాంతో బ్రహ్మాస్త్ర సినిమాకు తెలుగు లో కాస్త బజ్ అయితే క్రియేట్ అయ్యింది.ఇక తాజాగా బ్రహ్మాస్త్ర  అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయ్యింది.


ఆ మధ్య లాల్ సింగ్ చడ్డా కి నమోదు అయిన అడ్వాన్స్ బుకింగ్స్ తో మొదలు పెడితే బ్రహ్మాస్త్ర అడ్వాన్స్ బుకింగ్ చాలా బాగా జరుగుతుందని...ఇక తప్పకుండా సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో అడ్వాన్స్ బుకింగ్ మరింతగా పెరిగే అవకాశం ఉందని మేకర్స్ అంటున్నారు.అడ్వాన్స్ బుకింగ్స్ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రభావం బాగానే ఉందంటూ అభిమానులు ఇంకా సినీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు. బ్రహ్మాస్త్ర సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరుగా వసూళ్లు సాధించిన కూడా రాజమౌళికి ఇంకా ఎన్టీఆర్ కి ఆ క్రెడిట్ దక్కడం ఖాయం.బ్రహ్మాస్త్ర సినిమాలో రణబీర్ కపూర్ భార్య బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ హీరోయిన్ గా నటించగా నాగార్జున, అమితాబచ్చన్ లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. చాలా కాలం తర్వాత నాగార్జున హిందీలో నటించడం వల్ల అంచనాలు పెరిగాయి. అక్కినేని అభిమానులు బ్రహ్మాస్త్ర పై అంచనాలు పెంచుకుని నాగ్ పెర్ఫార్మన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: