సమ్మర్ తరువాత వరస ఫ్లాప్ లతో రెండు నెలలు పైగా సతమతమైపోయిన టాలీవుడ్ కు క్రితం నెల విడుదలైన ‘బింబిసార’ ‘సీతారామం’ ‘కార్తికేయ 2’ సినిమాలు మంచి జోష్ ను ఇచ్చాయి. చిన్న సినిమాలుగా విడుదలైన  ఈ మూడు సినిమాలకు కలక్షన్స్ వర్షం కురియడంతో ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ కష్టాలు తీరినట్లే అని భావించారు.


అయితే ఆ ఆనందం పట్టుమని రెండు వారాలు కూడ లేకుండా వెంటనే విడుదలైన ‘లైగర్’ భారీ ఫ్లాప్ తో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ‘లైగర్’ షాక్ నుంచి తేరుకుని ఆతరువాత విడుదలైన వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ చిరంజీవి స్వయంగా ప్రమోట్ చేసిన ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ నేతృత్వంలో వచ్చిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలలో ఎదో ఒక సినిమా అయినా హిట్ అవుతుందని ఆశించారు.


అయితే ఆ రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఆరెండు చతికల పడ్డాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజునాడు విడుదల అయిన వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగ’ మూవీని చూసి సగటు ప్రేక్షకుడు ‘రామ రామ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కనీసం పవన్ అభిమానులు కూడా ఈ మూవీని పెద్దగా పట్టించుకోకపోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది.


ఇక అనుదీప్ కథ అందించిన ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ సినిమాను చూసి సగటు ప్రేక్షకుడు తమ బుర్ర ఆగిపోయింది అని గగ్గోలు పెడుతున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు చిన్న సినిమాలు విదుదలైనప్పటికీ ఆరెండు సినిమాల టైటిల్స్ ను కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. దీనితో దసరా వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది అని అంటున్నారు. దసరా కు జరగబోతున్న చిరంజీవి నాగార్జున వార్ వరకు ఇదే పరిస్థితి కొనసాగిస్తే చిన్న సినిమాల భవిష్యత్ ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. దీనితో మళ్ళీ స్లంప్ కథ మొదలైందా అంటూ బయ్యర్లు ఖంగారు పడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: