టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు వివి వినాయక్.  టాలీవుడ్ చిత్ర పరిశ్రమ యొక్క పోకడను పూర్తిగా మార్చివేసిన ఈ దర్శకుడు ఇప్పుడు కొంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి.  దాదాపు 20 సంవత్సరాల క్రితం ఈయన కెరియర్ ప్రారంభంలో చేసిన సినిమాలు ఎంతటి స్థాయిలో చరిత్ర సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆ రికార్డులను తుడిచి పెట్టడానికి ఇప్పటికీ కొంతమంది దర్శకులు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆ విధంగా అతి తక్కువ సమయంలోనే వివి వినాయక్ అగ్ర దర్శకుడుగా మారిపోవడం ఆయనకు వేలాదిమంది అభిమానులుగా మారిపోవడం జరిగింది.  ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ వంటి హీరోలతో సినిమాలు చేసిన ఆయన ప్రేక్షకులను అలరించే సినిమాలను చాలా తక్కువగా చేస్తూ వచ్చాడని చెప్పాలి. ప్రస్తుతం ఆయన తెలుగు సినిమాలు చేయకపోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. ఆయన గత చిత్రాలు తెలుగులో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పుంచ లేదు. 

అందుకే బాలీవుడ్ లో ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు. అదే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చత్రపతి రీమేక్ సినిమా. ఈ చిత్రం తర్వాత ఆయన తెలుగులో సినిమా చేస్తాడని చాలామంది భావించారు కానీ మళ్ళీ ఆయన బాలీవుడ్ లోనే సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకోవడం అందరిలో ఎంతో నిరాశను కలిగిస్తుంది. మరి ఇక్కడ హీరోలు ఆయనను పట్టించుకోకపోవడం వల్లనే ఈ విధంగా బాలీవుడ్ ల సినిమాలు చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఆయన బాలీవుడ్ లో చేయబోయే రెండవ సినిమా యొక్క పూర్తి వివరాలు తెలియనున్నాయి. అందులో హీరోగా తెలుగు సినిమా హీరోనే ఉంటాడని చెబుతున్నారు. మరి తెలుగు సినిమా పోకడనే పూర్తిగా మార్చేసిన ఈ దర్శకుడు మళ్ళీ ఏ విధంగా కం బ్యాక్ చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: