మహేష్ బాబు హీరోగా ప్రేక్షకులను అలరించే సినిమాలు బాగానే వస్తున్నాయి కానీ అభిమానుల ఆకలి తీరే సినిమా రావడం లేదు అన్నది ఒక వర్గం మహేష్ అభిమానులు చెబుతున్న మాట. ఆయన గత నాలుగు చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి కానీ అభిమానుల ఆకలిని మాత్రం తీర్చడం లేదు అని వారు చెబుతున్నారు. ప్రేక్షకులకు మంచి సినిమాను అందించే క్రమంలో ఆయన అనిల్ రావిపూడి పరశురామ్ వంటి యువ దర్శకులతో మహేష్ బాబు సినిమాలను చేశాడు.

అంతేకాదు చిన్నదర్శకులతో సైతం సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అభిమానులకు ఆకలి తీరే విజయాన్ని ఆయన తెచ్చి పెట్టడం లేదు అన్నది మహేష్ అభిమానుల మాట. ప్రస్తుతం క్లాస్ సినిమాల దర్శకుడైన త్రివిక్రమ్ తో ఆయన సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. వాస్తవానికి త్రివిక్రమ్ సినిమాలు బాగానే ఉంటాయి కానీ ఆయన సినిమాల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అంటే అందులో మాస్ అంశాలు ఎక్కువగా ఉండాలి.

కానీ త్రివిక్రమ్ మహేష్ కు చెప్పి ఒప్పించిన కథ ఏ విధంగా ఉంది అంటే ఆ సినిమాలో మాస్ అంశాలు తక్కువగా ఉన్నాయని క్లాసిక్ ప్రేక్షకులను ఎంతగానో ఈ సినిమా అలరిస్తుందని కొంతమంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల మరియు అభిమానుల ఆకలి తీరుతుందా అనేది చూడాలి. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రారంభం కాబోతోంది. మరి ఈ రెండు సినిమాలతో వచ్చే ఏడాది ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్ ఏ స్థాయిలో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి మరి. ఆ తర్వాత కూడా మహేష్ చేయబోయే సినిమాల యొక్క దర్శకుల లిస్టు భారీ గానే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: