టాలీవుడ్ అగ్ర దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు ఏ విధంగా తన తదుపరి అడుగు వేయాలి అన్న సందిగ్ధతలో ఉన్నాడు. ఎన్నో రోజులుగా పవన్ కళ్యాణ్ తో ఆయన సినిమా చేయవలసి ఉండగా అది ముందుకు కదలక పోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. టాలెంట్ పరంగా ప్రేక్షకులను అలరించే ఎన్నో సినిమాలను రూపొందించిన ఈ దర్శకుడు వెంట వెంటనే సినిమాలను ఓకే చేసుకోవడంలో విఫలం అయ్యాడనే చెప్పాలి.

ఫలితంగా ఆయన పదేళ్ల సుదీర్ఘ కెరియర్లో చాలా తక్కువ సినిమాలే చేశాడు. ఇతర దర్శకులతో పోలిస్తే ఆయన సినిమాలో చేయడంలో నెమ్మదిగా వ్యవహరించాడు అని చెప్పా లి. ఆ విధంగా హరీష్ శంకర్ సక్సెస్ రేటు ఉన్నా కూడా పెద్ద హీరోలతో సినిమాలు చేయడంలో విఫలం అయ్యాడు. గద్దల కొండ గణేష్ సినిమా తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకో గా ఆ చిత్రం తర్వాత ఆయన నెక్స్ట్ సినిమా ఇంకా మొదలు పెట్టకపోవడం నిజంగా ఎంతో దురదృష్టకరం అనే చెప్పాలి.

పవన్ కళ్యాణ్ తో ఆయన సినిమా మొదలు పెట్టడానికి సిద్ధమైన నేపథ్యంలో దాన్ని ఇంకా మొదలు పెట్టకపోవడం అసలు ఆ సినిమా ను చేస్తాడో లేదో అన్న అనుమానా లు కలగడం హరీష్ శంకర్ అభిమానులను ఎంతగానో కలవర పరుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన మరొక హీరోతో సినిమా చేయడానికి ముందుకు వెళ్లాడని అంటున్నారు. విజ య్ దేవరకొండ హీరోగా హరీష్ శంకర్ ఓ సినిమాను త్వరలోనే చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత గా వ్యవహరించబోతున్నాడ ట. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమాను పక్కన పెట్టేసి హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలుపెట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే . 

మరింత సమాచారం తెలుసుకోండి: