ఇటీవల కాలంలో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను చేసే దర్శకులకు ఎంతగా డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియన్ సినిమా పరిశ్రమం లోని హీరోలందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేసే విధంగా ఆలోచనలు చేయడంతో ఇప్పుడు ఈ విధంగా సినిమాలు చేసే దర్శకులకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే కథలను సిద్ధం చేయగల సత్తా ఉన్న దర్శకుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న హీరోలకు ఇప్పుడు మరొక సరికొత్త దర్శకుడు ఆ విధం గా సినిమా చేసి సక్సెస్ అవడం వారిని ఎంతగానో సంతోషపెడుతుంది.

పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం కార్తికేయ 2. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాకు చందు మొండిటి దర్శక త్వం అందించారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు రావడంతో పాటు దర్శకుడికి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కాయి. అందుకే ఇప్పుడు ఈ దర్శకుడు తో సినిమా చేయడానికి చాలామంది పెద్ద హీరోలు ఎదురుచూస్తున్నారు. 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్లు జోరుగా కొనసాగుతున్నాయి. తెలుగులో మాత్రమే కాదు ఈ సినిమా కు నార్త్ లో కూడా మంచి గుర్తింపు లభించిం ది అక్కడ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడితో సినిమా చేయడానికి పలువురు అగ్ర హీరోలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఆయన ఎవరి తో తన తదుపరి సినిమాను చేస్తాడో అన్న విషయం తెలియాల్సి ఉంది. అగ్ర హీరోలు అందరూ కూడా తమ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథను తయారు చేయాలని ఆయన కు రిక్వెస్ట్ లు చేస్తున్నారట. త్వరలోనే ఆయన ఒక పెద్ద హీరోతో సినిమా ఓకే చేసుకున్న కూడా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అని కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: