అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. 

కీర్తి సురేష్ ఇప్పటికే ఈ సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తేరకెక్కిన సర్కారు వారి పాట మూవీ లో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. అలాగే ప్రస్తుతం కీర్తి సురేష్ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. 

మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , మెహర్ రమేష్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇలా వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ఎప్పటి కప్పుడు అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. 

అలాగే అప్పు డప్పుడు కీర్తి సురేష్ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కీర్తి సురేష్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా కీర్తి సురేష్ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని , డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: